Fire accident: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకుని భారీ నష్టం వాటిల్లింది. తెనాలి మండలం పెనుగుదురు పాడు గ్రామం వైపు మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా పెను గాలులు బీభత్సం సృష్టించడంతో మూడు వైపులా మంటలు దావానంలా వ్యాపించాయి. రైతులు తెనాలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంకా పంట నష్టం లెక్కించలేదని అగ్నిమాపక అధికారి తెలియజేశారు.
Fire accident: చెత్తకు నిప్పు పెడుతుండగా.. మంటలంటుకుని - మొక్కజొన్న పంటకు నిప్పంటుకుని భారీ నష్టం
Fire accident: అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించడంతో గాలి బీభత్సానికి చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి.
అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న