ఉద్యోగం నిమిత్తం మలేషియా వెళ్లిన గుంటూరు జిల్లా వాసి నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నరసింహారావు... టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడని... అందుకే అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. శాఖాపరమైన చర్యలు తీసుకుని అతడిని త్వరగా విడుదలయ్యేలా చూస్తామని హోంమంత్రి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
మలేషియాలో గుంటూరు వ్యక్తి అరెస్టు: హోం మంత్రి - home minister sucharitha
టూరిస్టు వీసాతో మలేషియా వెళ్లి ఉద్యోగం చేస్తున్న గుంటూరు వాసి నరసింహారావును అక్కడి పోలీసులు అరెస్టు చేశారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అతడిని త్వరగా విడుదల చేయించడానికి కృషి చేస్తానని హామీఇచ్చారు.
హోంమంత్రి సుచరిత