గుంటూరు జిల్లా మాచర్లలో ఎన్నిక ముగిసినా... ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై ప్రతిదాడికి అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పట్టణంలోని లాడ్జిల్లో ఉన్న తెదేపా నేతలను ఖాళీ చేయించారు. అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్కేకు పోలీసులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీగా భద్రతా బలగాలు మోహరించారు.
మాచర్లలో మళ్లీ ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు - police
పోలింగ్ రోజున తెదేపా, వైకాపా కార్యకర్తల ఘర్షణతో రణరంగాన్ని తలపించిన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేపై దాడి జరగనుందన్న సమాచారంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో భారీ బందోబస్తు మోహరించారు.
మాచర్ల పట్టణంలో పహారా కాస్తున్న పోలీసులు