గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో మౌలిక వసతులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రధానంగా అటవీ శాఖ నుంచి అదనంగా రెండెకరాల 42 సెంట్లు, రోజుకు 10 ఎంఎల్డీల నీరు, విద్యుత్ లైన్లు, రహదారులు వెంటనే నిర్మించాలని చెప్పారు.
జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు వచ్చే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. మంగళగిరి నుంచి ఎయిమ్స్ వరకు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నుంచి అదనంగా భూమి తీసుకోవాలని.. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. 6వ బెటాలియన్ నుంచి అదనంగా రెండెకరాల భూమి కావాలని ఎయిమ్స్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.