ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మృతదేహాల తరలింపునకు.. అంబులెన్సులకు ధరల నిర్ణయం..

గూంటూరు జిల్లాలో కొవిడ్‌-19 వైరస్‌తో కానీ, నాన్‌కొవిడ్‌ జబ్బులతో ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు, శ్మశానవాటికలకు తరలించేందుకు అంబులెన్సుల యాజమాన్యం అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మృతదేహాల తరలింపునకు అంబులెన్సుల ధరలను స్థిరీకరిస్తూ జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణయించిన ధరలను రెసిడెన్షియల్‌ మెడికల్‌ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షకులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని సూచించారు.

By

Published : May 7, 2021, 10:48 AM IST

fixed rates for dead bodies vehicles at guntur district
మృతదేహాల తరలింపునకు.. అంబులెన్సులకు ధరల స్థిరీకరణ

కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాప్తిస్తున్న వేళ.. గుంటూరు జిల్లాలో మృతదేహాల తరలింపు వ్యయ ప్రయాసల వ్యవహారంగా మారింది. అంబులెన్స్​ యజమానులు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు నేపథ్యంలో ఆయా మృతదేహాలను స్వస్థలాలు, శ్మశానవాటికలకు తరలించేందుకు స్థిరమైన ధరలు నిర్ణయిస్తూ కలెక్టర్ వివేక్ యాదవ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

చిన్న అంబులెన్సు వాహనం ద్వారా 10 కిలోమీటర్లలోపు నాన్‌ కొవిడ్ మృతదేహానికి రూ.1760 , కొవిడ్ మృతదేహానికి రూ.2,860గా ధరలు నిర్ణయించారు. 101 నుంచి 110 కిలోమీటర్ల దూరానికి చిన్నవాహనం ద్వారా నాన్‌-కొవిడ్ మృతదేహం తరలింపునకు రూ.4,620, కొవిడ్ మృతదేహానికి రూ.5,720గా ధర నిర్ణయించారు.

పెద్దవాహనాల ద్వారా తరలిస్తే కనిష్టంగా 10 కిలోమీటర్లలోపు నాన్‌ కొవిడ్ మృతదేహానికి రూ.1760 , కొవిడ్ మృతదేహం తరలింపునకు రూ.2,860గా ధరను నిర్ణయించగా...గరిష్టంగా 101 నుంచి 110 కిలోమీటర్ల దూరానికి నాన్‌ కొవిడ్ మృతదేహం తరలింపునకు రూ.5,060, కొవిడ్ మృతదేహానికి రూ.6,160గా ధర నిర్ణయించారు. అంబులెన్స్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఎంవీఐ ఫోన్ నంబర్ 81069 19957కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఎల్జీ పాలిమర్స్ గ్యాస్​ లీకేజీ: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details