3 రోజుల అనిశా కస్టడీకి అచ్చెన్నాయుడు
19:56 June 24
అచ్చెన్న ఏసీబీ కస్టడీకి అనుమతించిన అనిశా ప్రత్యేక న్యాయస్థానం
అచ్చెన్నాయుడిని 3 రోజులపాటు అనిశా అధికారుల కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడ్రోజులపాటు అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్ కుమార్‌నూ అధికారులు విచారించనున్నారు.
ఈఎస్ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కిందట అరెస్టు అయ్యారు. విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిశా అధికారులు అనుమతి కోరగా..మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయస్థానం అనుమతించింది.