ఎన్నికల సంస్కరణలకిదే కీలక సమయమని... అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సరైన కసరత్తు చేయకుండానే ఈసీ ఎన్నికలు నిర్వహించిందని ఆరోపించిన ఆయన... భవిష్యత్తులో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా జోరందుకుంటున్నఎన్నికల సంస్కరణలకుమోదీ ప్రభుత్వం గండికొట్టిందని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశమే స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్.
'ఎన్నికల సంస్కరణలకు మంచి సమయమిదే' - tdp
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈవీఎంల మొరాయింపు, శిక్షణ లోపాలు, ఓటర్లు వెనుదిరిగిన ఘటనలకు ఎన్నికల కమిషన్ పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్