కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. పన్నుల భారాన్ని మోపి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన తెదేపా నేతలు.. రాష్ట్రంలో పన్నుల విధానం సరిగ్గా లేదని ఆక్షేపించారు. ప్రభుత్వానికి హక్కు ఉంది అని ఇష్టానుసారం పన్నులు విధిస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సామాన్యులపై భారం మోపడం సరికాదన్నారు. చెత్త మీద కూడా పన్ను వసూలు చేసే దౌర్బాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. నూతన పన్నుల విధానాన్ని రద్దు చేయాలని ఆలపాటి డిమాండ్ చేశారు.
చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తారా..?: ఆలపాటి రాజా
ప్రభుత్వ తీరుపై మాజీమంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పన్నుల విధానం సరిగా లేదని, రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు విమర్శించారు. రైతులకు అండగా తెదేపా ఉంటుందని... వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని.. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ని ముట్టడిస్తామని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. వైకాపాకు ఓటు వేసిన వాళ్లే రాష్ట్రంలో ఉండాలన్న విధంగా ఉందన్నారు. తెదేపా సానుభూతిపరులు పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. రైతు సమస్యల పరిష్కారానికి త్వరలోనే కలెక్టరేట్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... YSR Beema: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!