అన్‌లాక్ తర్వాత గుంటూరు జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 208 కేసులు నమోదుకాగా... మొత్తం కేసులు 3416కు చేరాయి. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాకు చెందిన 2799 మందికి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 617మందికి పాజిటివ్‌గా తేలింది. వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి, అతని భార్యకు పాజిటివ్‌గా నిర్థరణ అయింది. తెనాలిలో 19, నరసరావుపేటలో 14, తాడేపల్లిలో 13, పిడుగురాళ్లలో 11, వినుకొండ 7 కేసులు వెలుగుచూశాయి. పిడుగురాళ్లలో రోజూ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. తాడికొండ నియోజకవర్గంలోని పోట్లపాడుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కరోనా బారినపడ్డారు. మందపాడలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా వచ్చింది.
10 రోజుల్లో 1811 కేసులు
మార్చి, ఏప్రిల్ నెలల్లో గుంటూరు జిల్లాలో 287 కేసులు రాగా... మే నెలలో 223 నమోదయ్యాయి. జూన్ నెలలో 1095 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక జులైలో పట్టపగ్గాలు లేకుండా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం 200, 300 కేసులు వస్తున్నందున కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గత 10 రోజుల్లోనే 1811 కేసులు వెలుగుచూశాయి.
ఆంక్షలు కఠినం