YSR YANTRA SEVA: ముఖ్యమంత్రి జగన్ నేడు వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రారంభించనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, ఇతర యంత్రపరికరాలు అందించే ఈ పథకానికి గుంటూరులో శ్రీకారం చుట్టనున్నారు. అలానే....చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్లాంటును జగన్ ప్రారంభించనున్నారు.
వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చే వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రభుత్వం విస్తరించనుంది. ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుతో యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటివరకూ చిన్నచిన్న పరికరాలు మాత్రమే సీహెచ్సీల్లో ఉండగా.....ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. 3 వేల 800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు..3 వేల 800 ట్రాక్టర్లు...320 క్లస్టర్ యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. 11 వందల 40 R.B.K.స్థాయి యంత్రసేవా కేంద్రాలకు ఇతర పనిముట్లు అందజేయనున్నారు. సంఘాలుగా ఏర్పడి ముందుకొచ్చిన రైతు గ్రూపులకు..... వీటిని అందిస్తారు. యంత్ర పరికరాలకు రాయితీ కింద.. రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175 కోట్ల 61 లక్షల రూపాయలను సీఎం విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ గుంటూరు శివారులోని నాయుడుపేట వెళ్తారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను..... ప్రారంభిస్తారు. 340 కోట్లతో..జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో..... చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జిందాల్ ప్లాంట్ ప్రారంభం అనంతరం సీఎం హెలికాప్టర్లో తాడేపల్లి బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా......గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇవీ చదవండి: