వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాహనమిత్ర' పథకానికి సంబంధించిన స్టిక్కర్లను ఆటోలకు... పోలీసులు అంటిస్తోన్న వీడియోను కన్నా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చటం కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఓటు వేసిన పాపానికి ఇసుక కొరత సృష్టించి కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
'వాహనమిత్ర'తో వైకాపా కార్యకర్తలుగా పోలీసులు: కన్నా
'వాహనమిత్ర' పథకానికి సంబంధించిన స్టిక్కర్లను ఆటోలకు... పోలీసులు అంటిస్తోన్న వీడియోను కన్నా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చటం కాదా అంటూ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
'వాహనమిత్ర'తో పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మారుస్తారా?: కన్నా
TAGGED:
vahana mthra