వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంలో.. రేపు తలపెట్టిన భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. గుంటూరు కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన...భారత్ బంద్ జయప్రదం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.
భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు: మస్తాన్ వలి - పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి వార్తలు
దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రేపటి భారత్ బంద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని ఏపీ పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. బంద్‌ను జయప్రదం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
mastan vali
కేంద్ర ప్రభుత్వం అహంకార ధోరణితో చట్టసభల్లో వ్యవసాయ బిల్లులను అమోదించిన రోజే కాంగ్రెస్ పార్టీ వాటిని వ్యతిరేకించిందన్నారు. మండీలు, మార్కెట్ కమిటీలు పెట్టమని మద్దతు ధర కల్పించేలా చట్టాలు చేయాలని రైతులు కోరుతుంటే కేంద్రం స్పందించడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు రైతులను బానిసలుగా చేసే కేంద్రం ప్రయత్నాన్ని ప్రజలందరూ అడ్డుకోవాలన్నారు.
ఇదీ చదవండి :సాహసమే నందిత వ్యాపకం