ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అపోహలు వద్దు..గుంటూరు ఛానెల్ పూర్తి చేసి తీరుతాం:హోం మంత్రి - water

ఎట్టి పరిస్థితుల్లోనైనా గుంటురు ఛానల్‌ను పూర్తి చేసి తీరుతామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులోని అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిచారు.

అపోహలు వద్దు..గుంటూరు ఛానెల్ పూర్తి చేసి తీరుతాం:హోం మంత్రి

By

Published : Jul 21, 2019, 12:56 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడులో అధికారులతో హోంమంత్రి సుచరిత సమీక్ష జరిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. గుంటూరు ఛానెల్ పొడిగించాలి నల్లమడ రైతు సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి...ఛానెల్‌పై రైతులు అపోహలు చెందవద్దన్నారు. ఛానెల్ పొడిగించే బాధ్యత తమదేనని... త్వరలోనే పూర్తిచేసి తీరుతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18వందల కోట్లతో వాటర్ గ్రిడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details