ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జే ట్యాక్స్ కోసమే కొత్త బ్రాండ్లు: ఆలపాటి

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్నం పెట్టమంటే.. జేట్యాక్స్ కోసం వైకాపా ప్రభుత్వం మద్యం పోస్తుందని తెదేపా నేత ఆలపాటి రాజా ఆరోపించారు. ఊరూ...పేరు లేని బ్రాండ్లు తెచ్చి ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారని విమర్శించారు.

జే ట్యాక్స్ కోసమే కొత్త బ్రాండ్లు : ఆలపాటి
జే ట్యాక్స్ కోసమే కొత్త బ్రాండ్లు : ఆలపాటి

By

Published : May 6, 2020, 5:05 PM IST

సామాన్యుల బలహీనతను ప్రభుత్వం క్యాష్ చేసుకుంటుందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. పేదవారు ఆకలితో అలమటిస్తుంటే అన్నం పెట్టకుండా సారా పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేట్యాక్స్ కోసమే మద్యం షాపులు తెరిచారని ఆరోపించారు. జగన్ నిర్ణయంతో ప్రజలందరూ విస్తుపోతున్నారని విమర్శించారు.

కరోనా వ్యాధిని కట్టడి చేయకుండా.. ప్రజలు మద్యం కోసం బారులు తీరేలా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని ఆక్షేపించారు. మంచి బ్రాండ్లను నిలిపివేసి.. ఊరూపేరు లేని బ్రాండ్లను తీసుకువచ్చారని మండిపడ్డారు.

కొన్ని బ్రాండ్లకే అనుమతి ఇచ్చి వాటి నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే బ్రాండ్లు తీసుకువచ్చి 75శాతం ధరలు పెంచారని ఆలపాటి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి :'కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రం అన్ని విధాలా సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details