గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ జిల్లాలో కొత్తగా మరో 206 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మెుత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 71వేల 632కు చేరుకుంది.
ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు నగర పరిధి నుంచి 40 కేసులు నిర్ధరణ అయ్యాయి. తెనాలి, బాపట్ల నుంచి 15 కేసులు చొప్పున, రేపల్లెలో 14 కేసులు, పొన్నూరు,మాచర్లలో 8 కేసుల చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా జిల్లాలో ఇవాళ ఒకరు మృతి చెందారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 641కి పెరిగింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 69,181 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో ఉంది.