పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ 45 డివిజన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఇంటి ముందు జనం బారులు తీరారు. భారీ స్థాయిలో ఓటర్ స్లిప్పుల పేరుతో నగదు పంపిణీ చేశారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రముఖ నాయకులు అక్కడే ఉండి నగదు పంపిణీ చేపట్టారని తెదేపా నాయకులు ఆరోపించారు.
45వ డివిజన్ వైకాపా అభ్యర్థి ఇలియాజ్ బాషా ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి నగదు పంపిణీలో సొమ్ము పొందని వారు.. నేరుగా అభ్యర్థి ఇంటి వద్దకు వచ్చి రూ.1000 చొప్పున నగదు తీసుకుంటున్నట్లు తెదేపా నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకుని జనాన్ని పంపించే ప్రయత్నం చేశారు.