తెదేపా నాయకుల అరెస్ట్‌లకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
- ప్రశాంతమైన జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయం..
ప్రశాంతతకు మారు పేరైన పశ్చిమగోదావరిజిల్లాలో పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయ విష సంస్కృతి ప్రవేశపెడుతున్నారని.. తెదేపా జిల్లా నాయకులు ఆరోపించారు. లొంగని తెదేపా నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారని మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. ఇప్పటికే జిల్లాలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి... మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
- ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి...
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్ల పూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదలయ్యాడు. ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగం పై పది రోజులు కిందట పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఎస్ఐ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని .... శ్రీనివాస్‌కి మద్దతుగా చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్డు పై బైఠాయించి... నినాదాలు చేశారు.