ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mahatma Gandhi: మహాత్ముడి తలపు.. చెట్టుతో మేలుకొలుపు

Mahatma Gandhi: మహాత్మాగాంధీ నాటిన మొక్క.. వృక్షమై నేడు శాంతి పరిమళాలను పంచుతోంది! స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాంధీ తపించిన తీరుకు నిదర్శనమై నిలుస్తోంది. అలనాడు ఉద్యమ స్ఫూర్తిని పంచిన ఆ మొక్క నేడు ఏలూరులో జ్ఞాపకాల సౌరభాలు వీస్తోంది.

Mahatma Gandhi
మహాత్మాగాంధీ నాటిన మొక్క

By

Published : Aug 8, 2022, 7:36 AM IST

Mahatma Gandhi: మహాత్మాగాంధీ దంపతులు 1921 ఏప్రిల్‌ 3న ఏలూరుకు వచ్చారు. స్థానిక అగ్రహారం ప్రాంతంలో ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని ప్రారంభించారు. ఆవరణలో ఓ మేడి మొక్క నాటారు. కస్తూర్బాగాంధీతో కలిసి మార్కండేయ స్వామి గుడిలో కొంతమంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ‘ఇప్పుడు ఈ చెట్టును చూసిన ప్రతి ఒక్కరూ అప్పట్లో ఉన్న పరిస్థితులను, పెద్దల త్యాగాలనూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు’ అని దేవాదాయశాఖ ఈవో ఆండ్ర రవిశంకర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details