పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట కొవిడ్ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ తాత్కాలిక సిబ్బంది చేసిన ఆందోళన ఉద్రిక్తంగా సాగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా బలవంతంగా బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ కదలమని భీష్మించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలకు తెగించి కొవిడ్ రెండోదశలో పనిచేసిన తమని ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తోందని వాపోయారు. నాలుగు నెలలుగా వేతనాలు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
PROTEST: జీతాలివ్వట్లేదని కొవిడ్ సిబ్బంది ఆందోళన - agitation at eluru collectorate
కొవిడ్ సమయంలో సేవలందించిన తాత్కాలికి సిబ్బంది జీతాలు రాకపోవడంతో ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
PROTEST