పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఎన్నికలు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8న ఏలూరు ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని, బ్యాలెట్ పెట్టెలను భద్రపరచాలని ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది.
ఏలూరులో ఎన్నికలు జరుపుకోవచ్చు: హైకోర్టు డివిజన్ బెంచ్ - ap muncipal elections 2021
17:22 March 09
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఎన్నికలు జరుపుకోవచ్చని.. ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.
అయితే ఆఖరి నిమిషంలో ఎన్నికల రద్దు సరికాదని.. పురపాలక ముఖ్యకార్యదర్శితో పాటు మరో వ్యక్తి సైతం మంగళవారం అత్యవసర అప్పీల్ వేశారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
అనుబంధ కథనం: