ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తలారిచెరువులోొ హత్యకుట్ర భగ్నం - STOP

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామ సమీపంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కొండచరియల్లో వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు

By

Published : Mar 14, 2019, 1:33 PM IST

Updated : Mar 14, 2019, 2:11 PM IST

హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామ సమీపంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గత ఏడాది సెప్టెంబర్​లో ఉరురుచింతలలో మల్లెల వెంకటరమణ, తలారి నాగ రంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఆమె బంధువులు వెంకటరమణను హత్య చేశారు. అడ్డు వచ్చిన నాగ రంగయ్యనూ మట్టుబెట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఈ హత్యలతో వెంకటరమణ, నాగ రంగయ్య బంధువులంతా ఒక్కటిగా చేరి పగతీర్చుకోవటానికి పథకం వేశారు. యల్లనూరు మండలం నిరజాంపల్లికి చెందిన వ్యక్తితో 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వారి హత్యకు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు.. తలారి చెరువుకి వస్తున్నారని తెలుసుకొని అక్కడే వేటకొడవళ్లతో కాపు కాశారు. ఈ విషయంపైగ్రామీణ సీఐ నారాయణ రెడ్డికి సమాచారం రావడంతో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, సిబ్బందితో కలిసి కొండ వద్దకు చేరుకున్నారు. ఐదుగురిని, వారి వద్ద ఉన్న వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్​కుతరలించారు. హత్య కుట్రను భగ్నం చేసిన సిబ్బందిని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి అభినందించారు.

Last Updated : Mar 14, 2019, 2:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details