ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తా: రఘువీరారెడ్డి - faghuveera reddy

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు , 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు.

రఘువీరారెడ్డి

By

Published : Feb 7, 2019, 3:15 PM IST

Updated : Feb 7, 2019, 3:37 PM IST

రఘువీరారెడ్డి
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. కల్యాణదుర్గం టికెట్ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరినట్టు చెప్పారు. ప్రజల అభీష్టం మేరకే అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నానని చెప్పారు. నెలాఖరులోగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మార్చి మెుదటి వారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరంలో పోటీకి దిగబోతోందని స్పష్టం చేశారు.
Last Updated : Feb 7, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details