ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sharmila: వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ... అక్కడినుంచే..! - పాలేరు నుంచి పోటీ చేయనున్న షర్మిల

Sharmila: వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని... అందుకే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.

Sharmila
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేస్తా- షర్మిల

By

Published : Jun 19, 2022, 2:04 PM IST

Sharmila: తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు. నేలకొండపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాలేరు నుంచి పోటీచేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేస్తా- షర్మిల

'ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేయాలనేది ప్రజల కోరిక. ప్రజల కోరిక మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తా. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దాం. పాలేరు నియోజకవర్గం దిశా - నిర్దేశం కావాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి.'-షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details