ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YCP Plenary: వైకాపా ప్లీనరీ మళ్లీ వాయిదా! - వైకాపా అధిష్ఠానం తాజా వార్తలు

వైకాపా ప్లీనరీ మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో ఏడాదీ ప్లీనరీని వాయిదా వేసినట్లు వైకాపా వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ycp plenary
వైకాపా ప్లీనరీ

By

Published : Jun 27, 2021, 9:03 AM IST

వైకాపా ప్లీనరీ మరోసారి వాయిదా పడింది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాదీ ప్లీనరీని వాయిదా వేసినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికి.. అంటే గతేడాది జులైలో ఘనంగా తొలి ప్లీనరీ (పార్టీపరంగా నాలుగోది) నిర్వహించేందుకు అప్పట్లో సిద్ధం చేశారు. అయితే కరోనా ప్రబలడంలో వాయిదా వేశారు. ఈ ఏడాది జులై 8, 9 తేదీల్లో విశాఖలో ప్లీనరీని నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు.

ఈలోపు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. సభ్యత్వ నమోదుకూ రంగం సిద్ధం చేశారు. అయితే కొవిడ్‌ రెండో దశ కొనసాగుతుండటం, మూడో దశ అంచనాల నేపథ్యంలో వచ్చే నెల నిర్వహించతలపెట్టిన ప్లీనరీనీ వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details