తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన వెనుక మతలబేంటని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో వ్యవస్థల్ని ప్రభావితం చేసేందుకు వచ్చారా అని విజయసాయి అడిగారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవన్న విజయసాయి..చంద్రబాబు సంగతి తెలిసే అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. దిల్లీలో చంద్రబాబును కలిసేందుకు ఎవరూ సమయం ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు.
MP VIJAYASAI REDDY: అమిత్షా అందుకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు: విజయసాయి - చంద్రబాబు తాజా వార్తలు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులు లేవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు దిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలన్న విజయసాయి.. తెదేపా అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ysrcp mp criticize chandrababu