అక్టోబరు 4 నుంచి.. 'వైఎస్ఆర్ వాహనమిత్ర' - ysr vahana mithra scheme starts from octomer 4th
వచ్చే నెల 4 నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కింద సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకునే వాళ్లకి ఏడాదికి పది వేల రూపాయలు సాయం అందిచనుంది.
ysr vahana mithra scheme starts from octomer 4th
అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 'వైఎస్ఆర్ వాహనమిత్ర' ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.