సీఎం క్యాంపు కార్యాలయ చెక్‌పోస్టు వద్ద పులివెందులకు చెందిన యువకుడు హడావుడి చేశాడు. తన మేనమామ సీఎంను కలవాలంటూ చెక్‌పోస్టు-4 వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన పేరు వైఎస్ సుబ్రమణ్యేశ్వర్‌రెడ్డి అని చెప్పిన యువకుడు.. సీఎంను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించిన పోలీసులు.. విచారణ చేపట్టారు. యువకుడు ఒకసారి తనది పులివెందుల అని.. మరోసారి శ్రీకాళహస్తి అని చెబుతున్నాడన్నారు. యువకుడి మానసిక పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జగన్ మా మేనమామ.. నేను కలవాలి.. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద యువకుడి హడావుడి - తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద యువకుడి హడావిడి
Youngman argument: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ యువకుడు హల్చల్ చేశాడు. ముఖ్యమంత్రి తన మేనమామ అంటూ... ఆయనను కలవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు.
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద యువకుడు హల్చల్