ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డబ్బులు ఇమ్మని కరాటే కల్యాణి బెదిరించింది.. ఇవ్వనంటే కొట్టింది..' - srikanth reddy videos

Youtuber VS kalyani:కరాటే కల్యాణి, యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డి మధ్య జరిగిన దాడి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్​రెడ్డి చేసే వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. అతడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయటంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిపై వివరణ ఇవ్వటంతో పాటు కల్యాణిపై పలు ఆరోపణలు చేస్తూ.. శ్రీకాంత్​రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు.

you tuber srikanth released video on karate kalyani attack
you tuber srikanth released video on karate kalyani attack

By

Published : May 13, 2022, 6:53 PM IST

Youtuber VS kalyani: యూట్యూబ్​లో ప్రాంక్​ వీడియోలు చేసే శ్రీకాంత్‌రెడ్డిని నటి కరాటే కల్యాణి చితకబాదిన ఘటన.. ఇప్పుడు సోషల్​ మీడియాలో పెద్ద దుమారానికి తెరలేపింది. ప్రాంక్‌ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా వీడియోలు చేయటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కరాటే కల్యాణి.. నిన్న(మే 13న) రాత్రి శ్రీకాంత్​రెడ్డిపై దాడి చేసింది. ఆ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్​ అవుతున్నాయి. కాగా.. ఈ వివాదంపై అటు శ్రీకాంత్​రెడ్డి, ఇటు కరాటే కల్యాణి.. ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఇద్దరు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై జరిగిన దాడిపై వివరణ ఇస్తూ.. శ్రీకాంత్​రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. అందులో.. అసలు జరిగిన ఘటన వివరించటంతో పాటు కల్యాణిపై శ్రీకాంత్​ పలు ఆరోపణలు చేశాడు. తాను ఏం తప్పు చేయలేదని.. కేవలం వినోదం కోసమే వీడియోలు చేసుకుంటున్నానని శ్రీకాంత్‌రెడ్డి వివరించాడు.

'డబ్బులు ఇమ్మని కరాటే కల్యాణి బెదిరించింది.. ఇవ్వనంటే కొట్టింది..'

"నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి మా ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు ఇద్దరుముగ్గురు మగవాళ్లు కూడా ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అంటూ అరిచారు. దానికి సమాధానంగా.. మీరు కూడా పలు సినిమాల్లో అడల్ట్​ సీన్లు చేస్తుంటారు.. కదా..? నేను చేసే వీడియోలు అంతకన్నా ఎక్కువ ఏమీ లేవు అన్నాను. నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్లు డబ్బులు తీసుకొనే చేస్తారని అని చెప్పాను. అయినా అవేమి పట్టించుకోకుండా.. కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న ఒకతను పక్కకి తీసుకెళ్లి.. గొడవెందుకు 70 వేలకి సెట్ చేస్తానంటే.. నేను మీకు ఎందుకు ఇవ్వాలని అడిగాను. డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి.. అన్నాను. మళ్లీ కల్యాణి నా దగ్గరికొచ్చి నన్ను కొట్టింది. సరే మహిళ కదా.. ఇంట్లో వాళ్లు కొట్టారన్నట్టు తీసుకుని నేనేమీ అనలేదు. అంతలోపలే ఇంకో వ్యక్తి కూడా కొట్టాడు. ఇంక నేను కూడా వాళ్లపై చెయ్యెత్తాను. ఈ క్రమంలోనే నా టీషర్ట్​ చింపేశారు. నాపై రేప్​ కేసు పెట్టిస్తానని, గూండాలతో కొట్టిస్తాని చాలా రకాలుగా బెదిరించింది. భాజపా వాళ్లు తెలునని, మహిళమండలి వాళ్లు కూడా తెలుసని ఏమేమో చెప్పి నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను ఎస్సార్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఒకవేళ తనకు నా వీడియోలు నచ్చకపోతే.. కంప్లైంట్​ చేయాలి. లేదా.. ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలతో కంప్లైంట్​ ఇప్పించాలి. అంతే కానీ.. ఇలా వ్యక్తిగతంగా వచ్చి నాపై దాడి చేయటం ఎంత వరకు కరెక్ట్​. నా వీడియోల్లో చేసేవాళ్లంతా ఆర్టిస్టులు. నా వీడియోల్లో శృతి మించి కూడా ఏం లేదు. మీ సపోర్ట్​ నాకు కావాలి. తాను ఫేంలోకి రావటానికి కరాటే కల్యాణి ఇలా నన్ను బదనాం చేస్తోంది."- శ్రీకాంత్​ రెడ్డి, యూట్యూబ్​ ప్రాంక్​ స్టార్​.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details