చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైకాపా కోరింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇతర నేతలు.. ఎస్ఈసీ పీఎస్‌కి మెమోరాండం అదించారు. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల తప్పుడు విధానం కొనసాగుతోందని అన్నారు.
ఎన్నికల్లో అక్రమాల నివారణకు యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినా.. దాన్ని ఎస్ఈసీ పక్కన పెట్టి సొంతంగా తయారు చేయడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వినియోగిస్తోన్న సీవిజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వైకాపా నాయకులు కోరారు.