ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేయండి'

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం అందించాలని వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి.. కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా 13 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని లేఖలో తెలిపారు. పాత వైద్య కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు సుమారు రూ. 13,500 కోట్లు అంచనా వేసినట్లు తెలిపిన ఆయన...ఇందుకు ఆర్థికసాయం అవసరమన్నారు.

mp vijaysaireddy
mp vijaysaireddy

By

Published : Nov 18, 2020, 9:44 PM IST

Updated : Nov 18, 2020, 9:52 PM IST

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం అందించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడమే కాక.. మరో 13 వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. పాత వైద్య కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం సుమారు రూ.13,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు విజయసాయిరెడ్డి లేఖలో తెలిపారు. ఇందుకు కేంద్రం ఆర్థిక సాయం అవసరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత టైర్‌ 1 నగరాలు లేనందున సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రైవేట్‌ వైద్య రంగం ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

కొవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల వైద్య సేవల రంగాన్ని త్వరితగతిన పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించారు. వైద్య సేవల రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం జిల్లాల వారీగా అమలు చేస్తున్న పథకం కింద తగినంత ఆర్థిక సాయం పొందడంలో కూడా.. రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని చెప్పారు.

ఆరోగ్య రంగంలో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు లేఖలో వివరించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు తగినంతగా ఆర్థిక సాయం చేయాలని తన లేఖలో కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ముందస్తు ఎన్నికలపై పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Last Updated : Nov 18, 2020, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details