ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థానానికి నిమ్మగడ్డ ఎలా న్యాయం చేస్తారు?' - ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి లేటెస్ట్ వార్తలు

వ్యక్తులు శాశ్వతం కాదు... వ్యవస్థలే శాశ్వతమని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారని మండిపడ్డారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8128760_64_8128760_1595418901087.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8128760_64_8128760_1595418901087.png

By

Published : Jul 22, 2020, 5:26 PM IST

Updated : Jul 22, 2020, 10:57 PM IST

'ప్రభుత్వంపై నిమ్మగడ్డ ఎందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు?'

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం విషయమై ఏం చేయాలనే విషయమై న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలను పరిశీలించి కన్సిడర్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచించారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిందని, అక్కడ కేసు విచారణలో ఉన్నందున తీర్పు కోసం వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు. తాము వ్యవస్థలను గౌరవిస్తామని.. వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని. ఇదే విషయాన్ని గవర్నర్ కు తెలియజేస్తామన్నారు. హైకోర్టు తీర్పును కానీ గవర్నర్ ఆదేశాలను కానీ తాము వ్యతిరేకించడం లేదన్నారు.ఏం చేయాలనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ నిర్ణయిస్తారని... ఆమేరకు నడుచుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు తో ప్రభుత్వం ఓడిపోయిందని ...నిమ్మగడ్డ రమేష్ విజయం సాధించారని తెదేపా నేతలు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. గంటకు కోట్లలో వసూలు చేసే లాయర్లను సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ నియమించుకున్నారని ..ఎవరి స్పాన్సర్లతో కోట్లు పెట్టి లాయర్ల ఫీజులు చెల్లిస్తున్నారని... నిమ్మగడ్డకు డబ్బు ఇస్తోంది చంద్రబాబు కాదా అని శ్రీకాంత్ ప్రశ్నించారు.

ఇవీ చూడండి-నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....

Last Updated : Jul 22, 2020, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details