ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ అయితే అరెస్టు చేయకూడదా..? అంబటి - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు

సాక్ష్యాధారాలను సేకరించే ఎంపీ రఘురామను పోలీసులు అరెస్టు చేశారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసులో చట్టం తన పని చాను చేసుకుపోతుందని చెప్పారు. ఎంపీని అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రఘురామను ఎవరూ కొట్టలేదన్నారు. డ్రామాలన్నింటికీ తెదేపా అధినేత చంద్రబాబు కారణమన్నారు.

mla ambati
ycp mla ambati rambabu on mp raghurama

By

Published : May 17, 2021, 4:18 AM IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తే చట్టం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడని మాటలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టుకుని టీవీల్లో రోజూ గంటల తరబడి వైకాపా ప్రభుత్వం సహా నేతలపై విమర్శలు చేశారన్నారు. కులాలను, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ కృష్ణరాజు మాట్లాడారని ఆరోపించారు.

రఘురామ కృష్ణరాజు సమాజంలో హింసను రెచ్చగొట్టేలా ప్రతి రోజూ బూతు మాటలు మాట్లాడారని.. సాక్ష్యాధారాలు సేకరించి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. రఘురామ రెచ్చగొడుతూ మాట్లాడిన 46 సీడీలను కోర్టులో ప్రవేశపెట్టారన్నారు. ఎంపీని అరెస్టు చేస్తే తప్పేంటి.. ఎంపీ అయితే అరెస్టు చేయకూడదా..? అని ప్రశ్నించారు. అరెస్టు అనంతర పరిణామాలతో ప్రభుత్వం , పోలీసులను అభాసుపాలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రఘురామను ఎవరూ కొట్టలేదన్నారు. ఎంపీ అరెస్టు అనంతరం జరుగుతోన్న పరిణామాలు.. డ్రామాలని, వీటన్నింటికీ తెదేపా అధినేత చంద్రబాబు కారణమని అన్నారు. ఎంపీ ప్రాణాలుకు హాని కల్గించాల్సిన అవసరం ప్రభుత్వం, పోలీసులకు లేదన్నారు.


ఇదీ చదవండి

నా భర్తకు ప్రాణహాని ఉంది: ఎంపీ రఘురామ భార్య రమ

ABOUT THE AUTHOR

...view details