ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదృశ్యమైంది... శవమై కనిపించింది! - తెలంగాణ వార్తలు

వారం రోజుల కిందట ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

lady suspect death
యువతి అనుమానాస్పద మృతి

By

Published : Jan 20, 2021, 1:11 PM IST

వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులు వెతికినా ఆచూకీ లేకపోవడం వల్ల ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details