ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

weather report
weather report

By

Published : Aug 8, 2020, 9:00 AM IST

ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఈ ప్రభావంతో శని, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించారు. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. నైరుతి మధ్యప్రదేశ్‌, దాన్ని ఆనుకుని ఉన్న గుజరాత్‌ ప్రాంతాల్లోని అల్పపీడనం బలహీనపడిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details