విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశంపై ప్రధాని మోదీని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి చర్చించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మార్చి ఒకటో తేదీన ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు నేతలు వివరించారు. కచ్చితంగా ఆరోజు ఏదో నిర్ణయం వెలువడనుందని ఆశాభావంతో ఉన్నారు కమలం నేతలు.
జోన్‌పై త్వరలోనే ప్రకటన - పీయూష్ గోయల్
విశాఖ రైల్వే జోన్‌పై త్వరలోనే ప్రకటన ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అంచనా వేస్తున్నారు. మార్చిలో రాష్ట్రంలో మోదీ పర్యటించనున్న సందర్భంగా ప్రధాని, రైల్వే మంత్రితో రాష్ట్ర భాజపా నేతలు భేటీ అయ్యారు.
ప్రధాని, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన రాష్ట్ర భాజపా నేతలు