జగన్ కేసుల్లో కీలక పరిణామం..
హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసులపై నేడు విచారణ జరిగింది. ఓఎంసీ కేసు అభియోగాల నమోదుపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు వినిపించారు. తనపై అభియోగాలు నిరాధారమైనవని సబిత కోర్టుకు తెలిపారు. ఆ అభియోగాలను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
విజయసాయిరెడ్డి కౌంటరు దాఖలు..
బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయసాయిరెడ్డి కౌంటరు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. తాను కోర్టు షరతులు ఉల్లంఘించలేదని.. రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసమే పిటిషన్ దాఖలు చేశారని విజయసాయిరెడ్డి కౌంటరులో పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినందున రఘురామ రాజకీయ కక్షతో పిటిషన్ దాఖలు చేశారన్నారు. రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలని విజయసాయిరెడ్డి కోరారు. పిటిషన్‌పై వాదనల కోసం విచారణను ఈనెల 20కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి