ముఖ్యమంత్రి జగన్ ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నారని.. మూడు రాజధానులపై ప్రజలు వేసిన కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఫీజుగా ఇవ్వడమే అందుకు నిదర్శనమని.. తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదైతే అంత డబ్బు ఇచ్చి న్యాయవాదిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజలు వేసిన కేసుపై వాదించడానికి ప్రజల డబ్బు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.
'నిర్ణయం సరైనదైతే.. న్యాయవాదికి అంత ఫీజు ఎందుకు?' - వర్ల రామయ్య మీడియా సమావేశం
ప్రజలు వేసిన కేసులో సర్కారు తరఫున వాదించడానికి రూ.5 కోట్లు ఫీజుగా ఇచ్చి న్యాయవాదిని పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని.. తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి కోసం పోరాడుతున్నారని పునరుద్ఘాటించారు.
వర్ల రామయ్య