ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 1350 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె ఎస్ కోటేశ్వరరావు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా టైం స్కేల్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారని ఆరోపించారు. 300 రోజులకు సంబంధించిన లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇవాళ్టికి విడుదల చేయకుండా వర్శిటీ అధికారులు తాత్సారం చేస్తోందని ఆరోపించారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఎవరైనా సమస్యలపై మాట్లాడితే.. బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
andhra university: 'వర్శిటీలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి' - ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె ఎస్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమస్యలపై మాట్లాడితే, బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయం