నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త హజరత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. నగరంలోని లస్సీ సెంటరులో ఆయనకు సెల్‌ఫోన్ దుకాణం ఉంది. ముఖాలకు చేతిరుమాలు కట్టుకున్న ఆరుగురు దుకాణానికి వచ్చి ఉన్నట్టుండి బీరు సీసాలతో దాడి చేశారని బాధితుడు పోలీసులకు వివరించారు. వారంతా 23 ఏళ్లలోపు యువకులేనని, తమ బాస్ మీద పోస్టులు పెడతావా? అంటూ హెచ్చరించారని వాపోయారు. ఇంతలో స్థానికులు రావడంతో పరారయ్యారని తెలిపారు. రక్తగాయంతో ఉన్న హజరత్‌ను ఆసుపత్రికి తరలించారు. చిన్న బజారు పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరులో సామాజిక మాధ్యమ కార్యకర్తపై దుండగుల దాడి - ఉండవల్లి అనూషపై పోలీసులు కేసు
రాష్ట్రంలో సోషల్ మీడియా వివాదం నడుస్తోంది. ఓ వైపు పోలీసుల నోటీసులు జారీ చేస్తుండగా...తాజాగా నెల్లూరులో తెదేపా సామాజిక మాధ్యమ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
unknown persons attack