ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాయం చేస్తే ఆరోగ్యానికీ మంచిదే!

కొందరిలో దయ, సానుభూతి, సాయం చేసే గుణాలు సహజంగానే కాస్త ఎక్కువుంటాయి. ఈ స్వభావం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌కు చెందిన పరిశోధకులు.

university
university

By

Published : Sep 13, 2020, 10:20 PM IST

ఇతరులకు సాయం చేసే మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవరికీ సహాయపడని వాళ్లతో పోలిస్తే ఆనందంగానూ ఉంటారని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే సాయం చేయడంలోనూ తేడాలుంటాయి. తమకుండే సహజ ప్రవృత్తితో చేసేవాళ్లు కొందరయితే, సమాజసేవ చేయాలనుకుని చేసేవాళ్లు మరికొందరు.

ఉదాహరణకు ఇరుగుపొరుగు వృద్ధులకి సరకులు తెచ్చివ్వడం, దారిలో ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించడం... ఇలా అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు సాయం చేసేవాళ్లు మొదటి రకమైతే; ఛారిటీలకి విరాళాలు ఇవ్వడం, లేదా సంస్థలు నెలకొల్పడం... వంటివి రెండో కోవకు వస్తాయి.

అయితే పనిగట్టుకుని సమాజ సేవ చేసేవాళ్లకన్నా సందర్భానికి స్పందించి సహాయం చేసేవాళ్లు మరింత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలిందట. అంతేకాదు, దీనివల్ల చిన్నవయసు వాళ్లలో మానసిక ఆరోగ్యం బాగుంటే, పెద్దవయసు వాళ్లకి శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రకమైన సహాయగుణం వల్ల మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారట.

ABOUT THE AUTHOR

...view details