ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ - high court orders on government land sales in ap

ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ఇదే కేసులో నేడు విచారణ జరగనున్నందున ఈ రెండింటినీ వీటికి జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మొత్తంగా కలిపి నేడు విచారణ జరపనుంది.

భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ
భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ

By

Published : May 28, 2020, 9:14 AM IST

విశాఖ, గుంటూరు జిల్లాల్లో 9 చోట్ల ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన హిమబిందు, శైలజ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు . ప్రభుత్వ భూములను ప్రజాహితం కోసమే విక్రయించాలి తప్ప... నిధుల కోసం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేని పురపాలకశాఖ, ఏపీఐఐసీ, వర్సిటీ భూములను విక్రయించబోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఇదే కేసులో గురువారం విచారణ జరగనున్నందున ఈ రెండు వ్యాజ్యాలను దానితో జత చేయాల్సిందిగా రిజస్ట్రీని ఆదేశించింది.

నేడు విచారణ

ప్రభుత్వ భూముల అమ్మకాల వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భూముల విక్రయానికి ప్రభుత్వం ఏమైనా దివాళా తీసిందా అంటూ ప్రశ్నించింది. తీర్పునకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి..

కామన్​ గ్రేడింగ్​తో పది విద్యార్థులను పైతరగతికి అనుమతించాలని పిల్​

ABOUT THE AUTHOR

...view details