ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఆర్డినెన్స్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడిందని మాజీమంత్రి దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు చెల్లుబాటుకావన్న ఉమ... ఈ తీర్పుపై జగన్ నోరువిప్పి ప్రజలకు సమాధానంచెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన 6నెలల్లో లక్షా 80వేలకోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయని విమర్శించారు. పీపీఏల రద్దుతో దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి.. ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్... 22మంది ఎంపీలనిస్తే మొదటి నెలలోనే అడుగుతూనే ఉంటామని మాటమార్చారని దుయ్యబట్టారు.
'హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి' - తెదేపా నేత దేవినేని ఉమా వార్తలు
ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు తీర్పుపై తెదేపా నేత దేవినేని ఉమా స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థలను హైకోర్టు కాపాడిందని హర్షం వ్యక్తం చేశారు. తీర్పుపై జగన్ నోరువిప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
TTP leader devineni uma responded to the High Court verdict for SEC