ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రూప్​-1 పరీక్ష రాస్తున్నారా... టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ సూచనలివే! - టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి జనార్దన్‌రెడ్డి

TSPSC Chairman Reveals All Arrangements for Group 1 Examination: గ్రూప్​-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ బి. జనార్ధన్​రెడ్డి తెలిపారు. అభ్యర్థులను బయోమెట్రిక్‌ తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని వెల్లడించారు. 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దని హెచ్చరించారు.

tspsc chairman
టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ బి. జనార్ధన్​రెడ్డి

By

Published : Oct 13, 2022, 9:58 AM IST

TSPSC Chairman Reveals All Arrangements for Group 1 Examination: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేశామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు సోషల్‌ మీడియా, ఇతరత్రా వదంతులు నమ్మవద్దని, పూర్తి సన్నద్ధతతో, మానసిక ప్రశాంతతతో పరీక్ష రాయాలని సూచించారు. 503 పోస్టులకుగానూ దాదాపు 3.8 లక్షల మంది హాజరయ్యే పరీక్ష నిర్వహణలో కొన్ని కీలక మార్పులు చేశామని, అభ్యర్థులందరి బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేయాలని నిర్ణయించామన్నారు.

ప్రిలిమినరీ తరువాత నిర్ణీత వ్యవధిలో మెయిన్స్‌ పూర్తిచేసి, వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణపై బుధవారమిక్కడ కమిషన్‌ సభ్యులతో కలిసి సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, 1,019 పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లతో ఛైర్మన్‌ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల వివరాలు, ఏర్పాట్లు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

ఉదయం 8.30 నుంచే అనుమతిస్తాం..ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల్ని ఉదయం 8.30 నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. 10.15 నిమిషాలకు గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులందరి బయోమెట్రిక్‌ తీసుకునేందుకు ఏర్పాట్లుచేశారు. 60 మంది అభ్యర్థులకు ఒకటి చొప్పున అవసరమైన మిషన్లు అందుబాటులో ఉంచారు. ఒక్కో అభ్యర్థి బయోమెట్రిక్‌ పూర్తిచేసేందుకు 15-20 సెకన్ల సమయం పడుతుంది కాబట్టి త్వరగా వస్తే ఆ ప్రక్రియ వేగంగా పూర్తిచేసి లోపలికి వెళ్లేందుకు వీలుంటుంది.

టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ చెప్పిన జాగ్రత్తలు..

  • ఓఎంఆర్‌ షీట్లో గడులు నింపేటప్పుడు, జవాబుల సర్కిళ్లు బబ్లింగ్‌ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. హాల్‌ టికెట్‌ నంబరు, పరీక్ష పత్రం, పరీక్ష కేంద్రం కోడ్‌ల తాలూకూ గడులు నింపకున్నా, సంతకం చేయకపోయినా సదరు ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోం. డబుల్‌ బబ్లింగ్‌, చాక్‌పౌడర్‌, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలనూ పరిశీలనలోకి తీసుకోం.
  • గతంలో ఏ, బీ, సీ, డీ సిరీస్‌ ప్రశ్నపత్రాలు ఉండేవి. ఇప్పుడు ఆరు అంకెల కోడ్‌తో బహుళ సిరీస్‌ ప్రశ్నపత్రాలు ఉంటాయి. వాటిలో జవాబులూ జంబ్లింగ్‌ అవుతాయి. అంటే ఒక సిరీస్‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నల తాలూకు జవాబులు, మరో సిరీస్‌ ప్రశ్నపత్రంలోని జవాబుల వరుస క్రమం ఒకేలా ఉండదు.
  • పరీక్ష తరువాత ఓఎంఆర్‌ షీట్ల ఇమేజింగ్‌ పూర్తిచేసి, ప్రాథమిక ‘కీ’ విడుదల చేయడానికి వారం రోజులకుపైగా సమయం పడుతుంది. ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ కన్నా ముందుగానే ఇవ్వాలంటే వారం రోజుల్లోపే విడుదల చేయొచ్చు. ఈ విషయమై కమిషన్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది.
  • సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు..
  • ఇప్పటివరకు 2.43 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మిగిలిన వారు చేసుకోలేదు. ఆయా అభ్యర్థుల మొబైల్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీలకు ఈ విషయాన్ని గుర్తుచేసేలా సమాచారాన్ని పంపుతున్నాం.
  • పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా, పోలీసు బందోబస్తు, గదుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది సేవలు తదితర విషయాలపై ఇప్పటికే కలెక్టర్లకు సూచనలు చేశాం.
  • పరీక్ష కేంద్రాల చిరునామాపై తలెత్తే సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని పరీక్ష కేంద్రాలకు అదనపు ట్రిప్పులు నడిపేందుకు ఆర్టీసీ అంగీకరించింది.
  • అభ్యర్థుల్లో కొందరు ఓటీఆర్‌లో ఫొటోలు, సంతకాలు సరిగా నమోదు చేయకపోవడంతో హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు కన్పించడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారికోసం డిక్లరేషన్‌ నమూనా కమిషన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాం. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కావడం లేదంటూ 67 మంది కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా అభ్యర్థుల వివరాలు పరిశీలించి, వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి ఆరా తీశాం. వారంతా ఓటీఆర్‌ పూర్తిచేసిన తరువాత గ్రూప్‌-1 దరఖాస్తు పూర్తిచేయలేదని తెలిసింది.
  • దివ్యాంగులు సంబంధిత అధీకృత అధికారులు జారీచేసిన వైకల్య శాతంతో కూడిన ధ్రువీకరణ పత్రాలతో కేంద్రానికి రావాలి. వినికిడి లోపం కలిగి..సంబంధిత పరికరాలు వినియోగించుకునే అభ్యర్థులు వైద్యుడి ధ్రువీకరణ వెంటతెచ్చుకోవాలి’’ అని బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details