ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బకాయిలు వెంటనే చెల్లించకపోతే వాహనాలు సమకూర్చలేం.. ప్రభుత్వానికి రవాణా శాఖ లేఖ - బిల్లలుపై రావాణా శాఖ లేఖ

Transport Dept Letter
ప్రభుత్వానికి రవాణా శాఖ లేఖ

By

Published : May 12, 2022, 1:31 PM IST

Updated : May 12, 2022, 2:30 PM IST

13:28 May 12

మూడేళ్ల పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని లేఖ

ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించకపోతే ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యనేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని తేల్చి చెప్పారు. రవాణామంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో కాన్వాయ్ వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. వీఐపీల కాన్వాయ్ ల కోసం ఏటా కనీసం నాలున్నర కోట్ల రూపాయలు అవసరమని లెక్క వేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details