కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కయ్యారా..?? అని కేసీఆర్ను ప్రశ్నించారు.
కృష్ణా జలాల పంపకం కోసం బోర్డులు ఏర్పాటయ్యాయన్న రేవంత్(Revanth reddy).. జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారని తెలిపారు. కృష్ణా, గోదావరి నది యాజమాన్యాల బోర్డులకు చట్టబద్ధత కల్పించారని చెప్పారు.