Tour and travels apps: కుటుంబమంతా కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు టికెట్ల నుంచి అక్కడ చేసుకునే ఏర్పాట్ల వరకూ ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీరా వెళ్లాక ఏదో ఒక ఇబ్బంది ఎదురైతే అసంతృప్తి, అసహనం తప్పదు. వాటన్నింటికీ ఈ ఆప్‌లు పరిష్కారం చూపిస్తున్నాయి. టికెట్ల ఏర్పాట్ల నుంచీ ఆ ప్రాంతంలో బడ్జెట్‌కి తగిన హోటళ్లూ, దొరికే ఆహారం, ఆ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల వరకూ.. ఇదీ అదీ అని కాకుండా అన్నిరకాల సదుపాయాల్నీ ఒక్క క్లిక్‌తోనే అందిస్తాయివి.
ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. మన భారత ప్రభుత్వం కొంతకాలం క్రితం.. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ పేరుతో పర్యటకుల కోసం ఓ ఆప్‌ను తెచ్చింది. మన దేశంలో రాష్ట్రాలవారీగా చూడదగిన ప్రదేశాలూ, ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే రెస్టారెంట్లూ, హోటళ్లూ ఇలా ప్రతి సమాచారాన్నీ తెలియజేస్తుందీ ఆప్.
ఫ్యాబ్‌హోటల్స్ ఆప్..మన బడ్జెట్‌కు తగిన హోటళ్ల వివరాలను చెబుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరువందల యాభైకి పైగా ఉన్న హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఈ ఆప్ ద్వారా ఏయే హోటళ్లు ఎంత సదుపాయంగా ఉంటాయి. వైఫై ఉంటుందా లేదా అక్కడ దొరికే ఆహారం ఏమిటి? అదనపు సౌకర్యాలు ఏమిటి? ఇలా అన్నింటినీ ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక రైలు/విమానం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కడ ఎక్కాలో తెలియజేస్తోంది.
‘ట్రిపిట్’ ఆప్.. దాంతో ఓ వైపు లగేజీ, మరోవైపు పిల్లల్ని తీసుకుని చివరి నిమిషంలో హడావుడిగా పరుగెత్తే కంగారు లేకుండా చేస్తుంది ‘ట్రిపిట్’ ఆప్. మనం టికెట్లు బుక్‌చేసుకున్నాక ఆ వివరాలను ఈ ఆప్‌లో నమోదు చేస్తే ఆ రోజున అందుబాటులో ఉండే క్యాబ్‌లూ, విమానం/రైలు సమాచారం ఇలా అన్నింటినీ ఎప్పటికప్పుడు అలారంలా తెలియజేస్తుంది. ఏ ప్లాట్‌ఫాంలో రైలు ఆగుతుంది/ లేదా విమానం ఎక్కేందుకు ఏ గేట్‌ద్వారా వెళ్లాలి.. లాంటి సమాచారాన్నీ చివరి నిమిషంలో చెబుతుంది. అవి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నా చెప్పే ఈ ఆప్ తరచూ ప్రయాణించేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.