ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Oct 9, 2022, 5:03 PM IST

  • ఉత్తుత్తి ప్రకటనలు మాని.. నిందితుడికి శిక్షపడేలా చూడండి:చంద్రబాబు
    కాకినాడ జిల్లాలో దేవిక హత్య కేసులో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలన్నారు. కొత్త చట్టాలు కాదు, కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంత్రి విడదల రజిని కాన్వాాయ్​కు ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనం
    Accident to Minister Vidadala Rajini Convoy: మంత్రి విడదల రజిని కాన్వాయ్​ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Buggana: " వైకాపా ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయి"
    Minister Buggana: వైకాపా ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని... అప్పులు 8 లక్షల కోట్లకు చేరాయంటూ తెదేపా నేత యనమల చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని, వైకాపా హయాంలో ఆర్థిక నిర్వహణ మెరుగుపడిందని చెప్పారు. తెదేపా నేతలు చెప్పే కాకి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • SRM University: అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్​.. కానీ రోడ్లే
    Dr TR Paarivendhar: రాజధాని అమరావతిలో రహదారుల పరిస్థితిపై ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు డాక్టర్ టి.ఆర్.పారివేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమకు ఇచ్చిన రెండు వందల ఎకరాల్లో.. అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్ నిర్మించామని తెలిపారు. మంచి భవనాలు, అత్యుత్తమ సిబ్బంది ఉన్నప్పటికీ యూనివర్శిటీకి వచ్చే రోడ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోలేదు: హర్షకుమార్‌
    congress leader Harsha Kumar:ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నడూ రాజధానిని కోరుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ పేర్కొన్నారు. సీఎం చెప్పడం వల్లే మంత్రులు రాజీనామా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నేతలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు కుట్రపన్నుతున్నారని హర్షకుమార్ విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
    ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డీఎంకే అధ్యక్షునిగా స్టాలిన్​.. వరుసగా రెండోసారి ఏకగ్రీవం
    DMK President Election : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. డీఎంకే అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలో ఆదివారం జరిగిన డీఎంకే సర్వసభ్య సమావేశంలో ఆయన వరుసగా రెండోసారి ఎన్నికైనట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాట్సాప్​లో బ్యాంకింగ్​ సేవలు కావాలా?.. ఇలా రిజిస్టర్​ చేసుకోండి!
    సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎస్​బీఐతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రధాన బ్యాంకులు పలు సేవలను డిజిటల్‌ విధానంలో అందుబాటులో ఉంచుతున్నాయి. తమ ఖాతాదారులకు 'వాట్సాప్‌ బ్యాంకింగ్‌' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే వాట్సాప్‌ సేవలకు ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 Worldcup: ఈ ఆటగాళ్లు చాలా కీలకం.. మరి ఎలా ఆడతారో!
    అక్టోబర్​ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా టీమ్​ఇండియా తమ తొలి మ్యాచ్​ను​ అక్టోబర్​ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనున్నాడు. అయితే ఈ మెగాటోర్నీలో విజయం సాధించి ట్రోఫిని ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అలా తమ 15ఏళ్ల నిరీక్షణకు తెర దించాలని ఆశిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాగచైతన్య మూవీటీమ్​పై దాడి.. గుడి దగ్గర ఆ పని చేశారని
    యంగ్​ హీరో నాగ చైతన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​ ప్రస్తుతం కర్ణాటకలోని ఓ చారిత్రక గుడిలో జరుగుతోంది. అయితే అక్కడి స్థానికులు ఆ చిత్రీకరణను అడ్డుకున్నారని తెలిసింది. ఎందుకంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details