ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Oct 3, 2022, 5:00 PM IST

  • వైద్య రంగంలో నోబెల్ దక్కించుకున్న పాబో.. మానవ పరిణామంపై పరిశోధనకు పట్టం
    Nobel Prize 2022 In Medicine: వైద్యరంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Chandrababu: స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉంది: చంద్రబాబు
    Chandrababu: విజయవాడలో బాలికలు గంజాయికి బానిసలవ్వడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గంజాయి వల్ల పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సంపాదనలో కొంత సమాజానికి ఖర్ఛు చేయాలి : వెంకయ్యనాయుడు
    Venkaiah Naidu: అవినీతిపై పోరాటం చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విలువలతో జీవించాలని.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌ కార్యక్రమాలను లోక్​సభ స్పీకర్‌ ఓం బిర్లా అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • TDP leaders protest: బురద నీటిలో కూర్చొని నిరసన... ఎందుకంటే..?
    TDP leaders protest: గ్రామానికి వెళ్లేందకు రోడ్డు సరిగా లేదని తెదేపా నాయకులు నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట రహదారిలో బురద నీటిలో కూర్చుని నినాదాలు చెశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం వేగవంతానికి ప్రభుత్వం చర్యలు
    PROJECT MANAGEMENT UNIT : విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్​ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ప్రాజెక్టు మేనేజ్మెంట్​ యూనిట్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 12 మంది అధికారులు, పలువురు సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కర్ణాటకలో బస్సు ప్రమాదం.. తెలుగు దంపతులు మృతి
    Karnataka Bus Accident: బెంగళూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన దంపతులు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. ఆదివారం ఆర్ధరాత్రి కర్ణాటకలోని హొసోట్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. మరణాన్ని తట్టుకోలేక తండ్రి సైతం..
    గుజరాత్.. నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. గర్బా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ!
    Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలతో కలిసి భోజనం చేశారు రాహుల్ గాంధీ. ఇదే భారత్​ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్లీన్​స్వీప్​​పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ప్లేయర్స్​కు విశ్రాంతి
    దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీన్​ చేయాలని భావిస్తోంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ కోసం జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నడిచేందుకు ప్రభాస్ ఇబ్బందులు​.. ఈవెంట్​లో ఏమైంది?
    ఆదిపురుష్​ టీజర్ రిలీజ్​ ఈవెంట్​లో ప్రభాస్​ సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయనకి ఏమైందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details