- ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారం.. ఎస్పీ ఏమన్నారంటే?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఫకీరప్ప మీడియాకు బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే...
- ఆ విషయం నాకు ముందే తెలుసు.. వీడియోను పెద్దగా పట్టించుకోలేదు: గోరంట్ల మాధవ్
MP Madhav Video: సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన న్యూడ్ వీడియో వంద శాతం ఫేక్ అని తాను గతంలోనే చెప్పానని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. వీడియో వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసునని చెప్పారు. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.., అది సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.
- మాధవ్ 'వీడియో' ఫేకో, రియలో.. వారే తేలుస్తారు: లోకేశ్
Madhav Nude Video: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో, రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒకవేళ అది ఫేక్ వీడియోనే అనుకున్నా.. 'నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటీ' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని లోకేశ్ ప్రశ్నించారు.
- రసాభాసగా విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం
GVMC Council Meeting: విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. గృహ నిర్మాణం, ప్రొటోకాల్‌పై సరైన సమాధానం ఇవ్వాలని తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండానే మేయర్ అజెండాలు కొనసాగించారు. దీంతో పోడియం వద్ద కూర్చుని విపక్షాల నిరసన చేపట్టాయి.
- 'ప్రధాని అభ్యర్థిగా నీతీశ్ కుమార్'.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor Bihar Politics: భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అసౌకర్యంగానే ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అలాగే తాజాగా ఏర్పడిన జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తారని జోస్యం చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నీతీశ్ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
- తదుపరి సీజేఐగా జస్టిస్ ఉమేశ్ లలిత్
New CJI of India 2022: సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జస్టిస్ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
- నుపుర్ శర్మకు ఊరట.. ఎఫ్‌ఐఆర్‌లన్నీ దిల్లీకి బదిలీ
Nupur Sharma news: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నుపుర్ శర్మపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను దిల్లీ పోలీసులకు బదిలీచేయాలని సుప్రీం ఆదేశించింది.
- వారి లోన్‌కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా? ఈ రిస్క్‌లు ఉండొచ్చు!
ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి లేదా వ్యక్తులు సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే.. ఆ బాధ్యత హామీదారుపై కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం హామీ సంతకం చేసే వ్యక్తి క్రెడిట్ స్కోరుపై కూడా ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు రుణం తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తొచ్చు.
- విజయ్ 'లైగర్' మేకింగ్ స్టిల్స్.. సూపరహే!
Liger Making Stills: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన 'లైగర్' టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.
- ICC Rankings: సూర్య జోరు.. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్
ICC Rankings Surya kumar yadav: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్లో టీమ్ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు.