- జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్.. బెస్ట్ యాక్టర్స్‌గా సూర్య, అజయ్ దేవగణ్
68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం, ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. నాట్యం చిత్రానికి గానూ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు.
- ప్రతి తరగతిలో డిజిటల్ బోధన.. విద్యా సమీక్షలో సీఎం జగన్
విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన చేయాలని.. ఇంటరాక్టివ్ టీవీలు, ప్రొజెక్టర్లతో బోధించాలని సీఎం జగన్ సూచించారు. స్మార్ట్ బోధనతో పిల్లలు, టీచర్లకు మేలు జరుగుతుందన్న సీఎం.. ప్రీ ప్రైమరీ నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
- పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు
CBN TOUR: జగన్ రెడ్డి అరాచకాలు ఇలానే కొనసాగిస్తే.. భూమి మీద ఎక్కడా తిరగలేడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటిస్తున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
- జీపీఎఫ్ సొమ్మును ఎందుకు ఉపసంహరించారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
High Court on GPF: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీపీఎఫ్ మాయం అంశంపై హైకోర్టులో విచారణ సందర్బంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక తప్పితం వల్లేనని ప్రభుత్వ న్యాయవాది జవాబివ్వగా.. ఎప్పుడూ ఇదేవిధంగా చెబితే ఓ చార్టెట్ అకౌంటెంట్‌ను అడ్వకేట్ కమిషనర్‌గా నియమించాల్సి వస్తుందని తెలిపింది. అఫిడవిట్ ఎవరు దాఖలు చేసినా.. సీఎస్ బాధ్యులు అవుతారని సూచించింది.
- ప్రత్తిపాడులో టెన్షన్.. వరుపుల రాజా ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల రాజా అరెస్ట్‌కు సీఐడీ ప్రయత్నిస్తోంది. పెద్ద సంఖ్యలో.. పోలీసులు రాజా ఇంటిని చుట్టుముట్టారు. తెలుగుదేశం శ్రేణులు పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజాను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ.. జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వర్మ ఇతర నేతలు.. పోలీసుల్ని నిలదీశారు.
- ఆటోపై పడిన లారీ.. ఏడుగురు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు
ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం హరియాణాలోని నుహ్‌లో జరిగింది.
- నీరవ్ మోదీకి షాకిచ్చిన ఈడీ! రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
Nirav Modi News: రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మోదీకి చెందిన సుమారు రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను హాంకాంగ్‌లో జప్తు చేసింది.
- 'ఇక పొడిగించేది లేదు.. అదే డెడ్‌లైన్'.. ఐటీఆర్ గడువుపై కేంద్రం క్లారిటీ
ఐటీఆర్ గడువుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని, ఆఖరు తేదీని పొడగించే ఉద్దేశం లేదని తెలిపింది.
- బ్యాంకులకు వచ్చే జనంపై యుద్ధ ట్యాంకులతో గురి! చైనాలో అంతే!!
China bank crisis: స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజల సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా ఇలా ప్రభుత్వం చేస్తోందని అంటున్నారు. అటువంటిదేమీ లేదని చైనా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం చైనాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా అవి తీవ్రతరమయ్యాయి.
- జడేజాకు గాయం.. విండీస్‌తో జరిగే సిరీస్‌కు దూరం!
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలికి గాయమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో వెస్టిండీస్‌తో జరిగే మొదటి రెండు వన్డేలకు అతను దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాయి. మూడో వన్డే ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు అధికారులు.